ETV Bharat / city

సిబ్బంది, అర్చకుల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి: మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Apr 28, 2021, 9:39 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా దేవాదాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ కారణంగా దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకుల ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రముఖ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా పూజలు నిర్వహించాలని కోరారు.

endowment minister vellampalli srinivasarao c
దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

దేవాదాయశాఖ ప‌రిధిలోని ఆల‌యాల్లో ప‌నిచేసే సిబ్బంది, అర్చకుల ఆరోగ్య భ‌ద్రత‌కు అధిక ప్రాధ్యాన‌ం ఇవ్వాల‌ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వారి ఆరోగ్య భ‌ద్రత దృష్ట్యా.. అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కరోనా ఉద్ధృతి కారణంగా దేవాదాయ శాఖ అధికారుల‌తో మంత్రి వెల్లంపల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవాల‌యాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకులు విధిగా మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఆలయానికి వ‌చ్చే భ‌క్తులు కూడా కరోనా నిబంధనలు పాటించేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

భ‌క్తుల‌ రద్దీ నియంత్రణ‌కు ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్‌ అవ‌కాశం ఉన్న దేవాల‌యంలో ఆన్​లైన్ విధానం అమలు చేయాలని అధికారులకు మంత్రి వెల్లంపల్లి సూచించారు. ప్రముఖ దేవాల‌య‌ల్లో స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా పూజ‌లు నిర్వహించాలని కోరారు. దేవాల‌యాల భ‌ద్రత‌కు సీసీ కెమెరాలు ఏర్పాటు, సెక్యూరిటిని పెంచ‌డం వంటి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు.

ఇదీచదవండి. 'టీకా ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.