కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విజయవాడలోని 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 5 చొప్పున కోడిగుడ్లు పంచిపెట్టారు. బలమైన ఆహారం తినటం వల్ల కరోనా వైరస్ను ఎదుర్కోవచ్చని వైద్యులు తెలిపారని.. అందుకే పేద ప్రజలకు గుడ్లు పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఇలా గుడ్లు, నిత్యావసరాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి.. 'కరోనాపై పోరుకు అందరూ నడుం బిగించాలి'