ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021(EAPCET)కి గానూ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2021-22 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ కాకినాడ ఈ ప్రవేశపరీక్షని ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.
అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26 నుంచి జులై 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు రోజూ 2 సెషన్లలో పరీక్ష జరగనుంది. ఆగస్టు 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి:
'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'