మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మల్లేశ్వరాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ శివలింగానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. మల్లికార్జున మహామండపం ఏడో అంతస్తులో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. లింగోద్భవ కాలం అనంతరం ఉత్సవమూర్తులను కల్యాణ వేదికపైకి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు.
ఉభయదాతల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ ఆదిదంపతుల దివ్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా రుత్వికులు గురువారం రాత్రి 12.30గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సురేష్‌బాబు, ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏనుగు విగ్రహాలకు పూజలు- ఆ గుడి ఎక్కడుందో తెలుసా?