ETV Bharat / city

వెండి సింహాల కేసు మిస్టరీ వీడేదెన్నడో? - దర్గ గుడి సింహాల దొంగతనంపై వార్తలు

దుర్గ గుడి ఆలయ రథం సింహం ప్రతిమల అదృశ్యం కేసులో విచారణ కొనసాగుతోంది. పాత నేరస్థులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ తరహా చోరీలు చేయడంలో ఆరితేరిన ముఠాల గురించి ఆరా తీస్తున్నారు.

durga gudi lion theft case turning around old accused
వెండి సింహాల కేసు మిస్టరీ వీడేదెన్నడో?
author img

By

Published : Oct 9, 2020, 7:39 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్గగుడి వెండి రథానికి ఉన్న వెండి సింహాల చోరీ కేసు పాత నేరస్థుల చుట్టూ తిరుగుతోంది. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు దర్యాప్తు మినహా.. ఇతర విచారణలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై విచారణకు వేసిన దేవస్థాన కమిటీలో ఒక పాలకమండలి సభ్యురాలు అక్రమ మద్యం రవాణాకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇతర సభ్యులు ఇంతవరకు నివేదికలు ఇవ్వలేదు. అందరూ పోలీసు దర్యాప్తులో తేలే అంశాలవైపు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా చోరీలు చేయడంలో ఆరితేరిన ముఠాల గురించి ఆరా తీస్తున్నారు.

తూతూమంత్రం విచారణలే..!

అమ్మవారి వెండి రథానికి ఉన్న సింహాలు మాయమైనట్లు సెప్టెంబరు 13న అధికారులు గుర్తించారు. ఈ విషయం ఆ నెల 15న ప్రసారమాధ్యమాల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. 16న తెదేపా, భాజపా, జనసేన ఇతర ధార్మిక సంస్థల ప్రతినిధులు వెండి రథాన్ని పరిశీలించి చోరీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా పరిశీలించి బాధ్యులపైచర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు 15 రోజుల తర్వాత క్లూస్‌ టీం ఫోరెన్సిక్‌ బృందం వచ్చి ఆధారాల కోసం ప్రయత్నాలు చేసింది. అప్పటికే ఆ ప్రాంతం అంతా పలువురు సందర్శించారు. దీంతో ఫోరెన్సిక్‌ బృందానికి అంతగా ఆధారాలు లభ్యం కాలేదు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్సు బృందం విచారణ నుంచి తప్పుకుంది. సీసీఎస్‌ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగినట్టే ‘రికవరీ’ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఘటనపై ఈవో సురేష్‌బాబు స్పందిస్తూ.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

  • దుర్గగుడిలో కొంతమంది బిహార్‌ కార్మికులు ఆ సమయంలో పని చేసినట్లు గుర్తించి వారిని తీసుకొచ్చి విచారించారు. స్థానికంగా చోరీ సొత్తు కొనుగోలు చేసే వారిని విచారించారు. ఆభరణాలు తయారు చేసే వారిని అనుమానించి విచారించారు. ఒక్క ఆధారం కూడా లభించలేదు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవో మూర్తిని విచారణ అధికారిగా నియమించింది. ఒకసారిఆయన దుర్గగుడిని సందర్శించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఎవరినీ బాధ్యులను చేయలేదు. నివేదిక ఇచ్చారో లేదో తేలలేదు.
  • గతనెల 13న చోరీ సంఘటన వెలుగు చూడగా.. పోలీసులకు 18న ఫిర్యాదు చేశారు. దీంతో వారు టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేశారు.
  • తొలుత దేవస్థానం ఏఈవో రమేష్‌, ఈఈ భాస్కర్‌, పాలకమండలి సభ్యులు సుజాత, నాగవరలక్ష్మిలతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఇంతవరకు ఏమీ తేల్చలేదు. కానీ కరోనా కాలంలోనే సింహాలు చోరీకి గురైనట్లు మాత్రం అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామ కృష్ణరాజు సంస్థపై సీబీఐ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.