భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా డాక్టరు పార్థసారథి నియమితులయ్యారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న పార్థసారథి.. 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో.. తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహించారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టరు కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి: 'రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం విఫలం'