ETV Bharat / city

BEL New Independent Director : బీఈఎల్ ఐడీగా పార్థసారథి...ఉత్తర్వులు జారీ... - BEL New Independent Director

BEL New Independent Director: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్​గా పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

BEL New Independent Director
బిఈఎల్ ఐడీగా పార్థసారథి...ఉత్తర్వులు జారీ...
author img

By

Published : Dec 31, 2021, 3:20 PM IST

BEL New Independent Director: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్​గా పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. దీనిపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. పార్థసారథికి లేఖ రాశారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. డైరెక్టర్​గా ఆయన సలహాలు, సూచనలతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరింత అభివృద్ధి చెందుతుందని లేఖలో తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి డాక్టర్​ పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భాజపా నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలో అత్యంత నిబద్ధతతో పని చేస్తానని పార్థసారథి తెలిపారు. దేశ రక్షణ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తుట్లు తెలిపారు.

పార్థసారథి ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా భాజపా ఓబీసీ మోర్చాలో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ పార్థ డెంటల్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఆయన క్లినిక్స్ నడుపుతున్నారు.

ఇదీ చదవండి : CM Jagan Guntur Tour Schedule: రేపు ప్రత్తిపాడులో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.