వివిధ పరిశ్రమలు, సంస్థలకు భారంగా మారిన నిబంధనలను ఏ విధంగా సరళీకరించాలన్న అంశంపై.. పరిశ్రమలు, అంతర్గత ప్రోత్సాహక మండలి (డీపీఐఐటీ) చర్చించింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో సమావేశమైన మండలి.. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 18 నాటికి నివేదిక అందించాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్‌ను ఆదేశించారు.
దిల్లీలో ఈనెల 20న జరగనున్న గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో.. ఇందుకు సంబంధించిన పోర్టల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ భారం తగ్గించే విషయంపై పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: