విజయవాడ నగరపాలక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఐలా తదితర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆటోనగర్‌లో పర్యటించారు. ఆటోనగర్‌లోని వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వారం రోజుల్లో సంబంధిత అధికారులు ఆటోనగర్‌లో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేస్తారన్నారు.
ఆటోమొబైల్ యూనిట్లను పరిశీలించిన కలెక్టర్...అక్కడి వ్యర్థాలను ఏ రూపంలో తరలిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాత బ్యాటరీలను ఎక్కడికి తరలిస్తున్నారు? వాటి భాగాలు ఏ విధంగా విడగొడుతున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆటోనగర్‌లో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. సీసం ఇతర అవశేషాల వల్ల తాగునీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఐలా ఛైర్మన్ దుర్గాప్రసాద్‌కు సూచించారు.
ఇదీచదవండి
ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు