దళిత నిరుపేదలను వారి నివాస గృహాల నుంచి బలవంతంగా తొలగించవద్దని, కడప జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలను బలవంతంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ రంగసముద్రం పోరుమామిళ్లకు చెందిన నాగరాజు తదితరులు హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు.
వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. అన్యాయంగా, నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను విన్న న్యాయస్థానం నిరుపేదలను, దళితులను బలవంతంగా తమ నివాస గృహాల నుంచి ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని..బాధిత కుటుంబాలను వారి నివాస గృహాల నుంచి తొలగించాలంటే చట్ట ప్రకారమే నడుచుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
MPTC, ZPTC Votes Counting: శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలుపు