రామతీర్థం ఘటనపై కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోడికొండపై రామాలయానికి విద్యుత్ సదుపాయం కల్పించి రెండు మూడు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయం, పరిసరాలు బాగా తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అన్న డీజీపీ.. దర్యాప్తు పురోగతిలో ఉందని వెల్లడించారు.
మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ నిపుణుల సలహా కోరామన్న డీజీపీ.... ఈ ప్రసంగాల వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు. వరుస ఘటనలు ఒక దానికి మరో దానితో సంబంధం ఏమైనా ఉందా? అని విశ్లేషిస్తున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: