ETV Bharat / city

దేవాలయాలకు జియో ట్యాగింగ్‌: గౌతం సవాంగ్ - ఏపీలో టెంపుల్స్ జీయో ట్యాగింగ్ వార్తలు

రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగించేలా.. ఎస్పీలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.

dgp on geo tagging to temples
dgp on geo tagging to temples
author img

By

Published : Sep 12, 2020, 3:30 PM IST

Updated : Sep 12, 2020, 4:04 PM IST

రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు. ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగిస్తూ.... సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలతోపాటు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా నిర్వాహకులు విద్యుత్తు దీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని.... అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీజీపీ తెలిపారు.

ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... భద్రత చర్యలను ఎప్పటికిప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మతసామరస్యానికి ప్రతీకైన రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని గౌతం సవాంగ్ పేర్కొన్నారు. అలాంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

Last Updated : Sep 12, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.