ETV Bharat / city

అమ్మా.. దుర్గమ్మా... సౌర వెలుగులు ఎప్పుడమ్మా? - విజయవాడ వార్తలు

Solar Project Delay: దుర్గ గుడిలో చేపట్టిన సౌర ప్రాజెక్టు పూర్తయితే.. ఆలయానికి ఏటా కోటి రూపాయల ఆదాయం ఆదా అవుతుంది. విద్యుత్‌ బిల్లుల సొమ్ము ఆదా కావడమే కాదు.. మిగులు విద్యుత్‌ అమ్మకం ద్వారా రూ.14 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశమూ ఉంది. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు ఓ సమస్య కారణంగా రెండేళ్లుగా ఆగింది. పట్టించుకునేవారు లేక దుర్గ గుడి ఏటా రెండు కోట్ల వరకూ ఆదాయం కోల్పోతోంది.

vijayawada kanaka Durga temple
vijayawada kanaka Durga temple
author img

By

Published : Jun 1, 2022, 8:41 PM IST

అమ్మా.. దుర్గమ్మా ... సౌర వెలుగులు ఎప్పుడమ్మా?

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయంగా గుర్తింపు ఉంది. భక్తుల సౌకర్యాలు, కార్యాలయ నిర్వహణ, ఉద్యోగుల నివాస గృహాలు ఇలా వివిధ అవసరాల కోసం భారీగానే విద్యుత్‌ వాడుతున్నారు. దుర్గ గుడితో పాటు కొండ దిగువున ఉన్న భవనాలు, జమ్మిదొడ్డి కార్యాలయం, సి.వి.రెడ్డి ఛారిటీస్‌, మాడపాటి సత్రం, ఉద్యోగుల క్వార్టర్లు సహా అన్నింటికీ కలిపి నెలకు రూ. 8 లక్షల వరకు విద్యుత్తు బిల్లులకు ఖర్చవుతోంది. ఈ స్థాయిలో విద్యుత్తు బిల్లులకు ఖర్చవడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

విజయవాడ శివార్లలోని పాతపాడులో దేవాలయానికి చెందిన ఐదెకరాల్లో మూడేళ్ల కిందట సౌర విద్యుత్తు ప్లాంట్‌ పనులు ప్రారంభించి వడివడిగానే పూర్తి చేశారు. ప్లాంట్‌ ను సబ్‌ స్టేషన్‌కు అనుసంధానించడం కోసం కేబుళ్లు ఏర్పాటు చేయడంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా రెండేళ్లవుతున్నా ఉత్పత్తి మాత్రం ఆరంభించలేదు. సౌరశక్తి ప్లాంటు నుంచి కేబుళ్లు వేసే విషయంలో తొలుత సమీప గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలిపారు. రెండు గ్రామాల ప్రజలను ఒప్పించే విషయంలో రెండేళ్ల కాలయాపన జరిగింది. ఇటీవల కేబుళ్లను మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించారు.

దుర్గగుడికి ఏటా ఈవోలు మారుతూ ఉండడంతో సౌర విద్యుత్తు ప్లాంట్‌ను అందుబాటులోనికి తీసుకురావడంలో తగిన శ్రద్ధ చూపలేదు. ప్లాంట్‌కు ప్రణాళికలు రూపొందించినది ఒకరి హయాంలో.. నిర్మాణం మరొకరి హయాంలో జరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఈవోలు మారారు. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు సైతం తరచూ మారుతుండడం వల్ల పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. గ్రామస్తుల అభ్యంతరంతోనే పనులు నిలిచాయని అధికారులు చెబుతున్నారు.

ఈ ప్లాంట్‌ నిర్మాణంతో దుర్గ గుడికి ఏటా కనీసం కోటి ఆదా అవుతుందని అంచనా. రెండేళ్లుగా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రూ.2 కోట్ల వరకూ ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ప్లాంట్‌ నిర్మాణానికి రాయితీ పోను దేవస్థానానికి 3 కోట్ల 71 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ ప్లాంట్‌ ద్వారా ఏటా 16లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఆలయానికి వినియోగించుకోగా ఏటా 2లక్షలకు పైగా యూనిట్లను విద్యుత్‌శాఖకు అమ్మడం ద్వారా ఏటా రూ.14లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్లాంట్‌కు పెట్టిన రూ.3కోట్ల71 లక్షల వ్యయం నాలుగేళ్లలోపే తిరిగి వచ్చేస్తుంది. అడ్డంకులు తొలగిపోయాయని త్వరలోనే ప్లాంటును ప్రారంభిస్తామని దుర్గ గుడి ఈవో చెబుతున్నారు.

ఆలయ అధికారులు వచ్చేనెల రెండో వారంలోగా వినియోగంలోకి తేవాలని భావిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఎంత వరకు ఆచరణ సాధ్యం అవుతుందనే అనుమానాలున్నాయి.

ఇదీ చదవండి : దుర్గగుడికి ఏటా రూ.90 లక్షలపైనే కరెంటు బిల్లులు ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.