దెబ్బతిన్న డ్రైనేజీకి మరమ్మతులు చేయాలని కోరుతూ... విజయవాడ 30వ డివిజన్లో సీపీఐ, సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. 3 నెలలుగా రామకృష్ణాపురం, దేవీ నగర్, గద్దె వెంకటరామయ్య నగర్, తావుబుచ్చయ్య కాలనీల మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తిని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేవీ నగర్ రైల్వేవంతెన కింద నీరు చేరి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అధికారులు స్పందించటం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు తక్షణమే స్పందించి రోడ్లు బాగుచేయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: