ETV Bharat / city

AP CS: 'ఉద్యోగులు సమ్మె వరకు వెళ్లకుండా చూడండి'.. అధికారులకు సీఎస్​ ఆదేశాలు

CS sameer Sharma on Employees Issue: ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్​ శర్మ ఆదేశించారు. కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్​ సమావేశమయ్యారు. అలాగే.. పలువురు ట్రెజరీ అధికారులు, డీడీవోలకు ప్రభుత్వం ఛార్జ్​ మెమోలు జారీ చేసింది.

సమీర్​ శర్మ
CS sameer Sharma
author img

By

Published : Jan 31, 2022, 7:29 PM IST

Updated : Jan 31, 2022, 7:36 PM IST

CS sameer Sharma on Employees Strike: ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, హెచ్​వోడీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఆర్థికశాఖ, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం వేతనాల బిల్లులు ఎంత వరకూ వచ్చాయన్న దానిపై సీఎస్ సమీక్షించారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని ఉద్యోగులకు తెలియచెప్పాలని కలెక్టర్లు, ఆయా శాఖల అధిపతులకు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనని.. వేరుకాదన్న విషయాన్ని తెలియచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. హర్తాళ్లు, ఆందోళనలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్మికులు కాదని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 వారికి రక్షణ కల్పిస్తోందని సీఎస్ వ్యాఖ్యానించారు.

పలువురు ట్రెజరీ అధికారులకు మెమోలు జారీ

Memos to Treasury Officers: పీఆర్సీ బిల్లులను ప్రాసెసింగ్ చేయని ట్రెజరీ అధికారులు, డీడీవోలకు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్​ మెమోలు జారీ చేసింది. మొత్తం 27 మంది డీడీ, ఎస్టీవో, ఎటీవోలకు మెమోలు జారీ చేశారు. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు మెమోలు ఇచ్చారు. జీతాల బిల్లులు సిద్ధం చేయాలని ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ మెమోలను జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని ఎస్టీవోలందరికీ విధుల నిర్లక్ష్యం పట్ల వివరణ ఇవ్వాల్సిందిగా మెమోల్లో పేర్కొంది.

ఇదీ చదవండి..Employees Protest: విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగులు మహా ధర్నా

Last Updated : Jan 31, 2022, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.