కోర్టు కేసుల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వంపై దాఖలు అవుతున్న కేసుల పర్యవేక్షణ కోసం ఆన్ లైన్ లీగల్ కేసు మానిటరింగ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సూచించారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు.
వివిధ ప్రభుత్వశాఖలపై పెండింగ్ కేసుల వివరాలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఇకపై ప్రతినెల సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసుల పెండెన్సీని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ఆన్ లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టంతో పాటు సైబర్ సెక్యూరిటీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: IPS transfers: రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ.. ఎక్కడికంటే..!