జిల్లా కలెక్టర్లు వారానికి రెండు సార్లు గ్రామవార్డు సచివాలయాలను తనిఖీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాథ్ దాస్ ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించిన ఆయన.. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
గ్రామవార్డు సచివాలయాల పనితీరును జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు వారానికి రెండు సార్లు, జేసీలు, మునిసిపల్ కార్పొరేషన్లు కమిషనర్లు, సబ్ కలెక్టర్లు వారంలో నాలుగు గ్రామవార్డు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఇదీచదవండి.