పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంభపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులపై పేకాటరాయుళ్లు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరి వెళ్లిన పోలీసులు పూర్తిస్థాయి సిబ్బందితో వచ్చి 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 33 మంది పేకాటరాయుళ్ల అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.23 లక్షల నగదు, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు,లారీ ఢీ కొన్న ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి :
Fake IAS: ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్