CPS placards: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంలో.. తమ సమస్యను ప్రజాప్రతినిధులకు తెలిపేలా సీపీఎస్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ గడపకు రావాలంటే, జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలకలు, అట్టలపై రాసిన బోర్డును ఇంటి గేటు ముందు పెట్టారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుర్రం మురళీ మోహన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గడప గడపలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే బోర్డులను ఉద్యోగులు పెట్టాలని కోరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోనూ ఓ ఉపాధ్యాయుడు సీపీఎస్‌ను రద్దు చేయాలని బోర్డు పెట్టారు.
బాపట్ల జిల్లా అద్దంకిలోని దామావారిపాలేనికి చెందిన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు.. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్నారు. అద్దంకిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. ఇంకా ప్రారంభం కాకపోయినా ముందస్తుగానే నాగేశ్వరరావు తన ఇంటి గేటుకు బోర్డు ఏర్పాటు చేశారు. మరికొందరు ఉద్యోగులు కూడా ఇలానే నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారని నాగేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి: