ETV Bharat / city

విజయవాడలో సీపీఎం ఆందోళన

మున్సిపల్ కార్పొరేషన్ చెత్తపై పన్ను విధించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సామాన్యులపై పన్నుల భారం మోపితే ప్రజా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు
ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు
author img

By

Published : Oct 12, 2020, 12:23 PM IST

విజయవాడలో సీపీఎం ఆందోళన చేపట్టింది. చెత్తపై పన్ను విధించడం దారుణమని సీపీఎం నాయకులు మండిపడ్డారు. దానికి సంబంధించిన జీఓ కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఓపక్క పేదలకు ఉచిత పథకాలు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... పన్నుల రూపంలో పేద ప్రజలపై భారం మోపడం దారుణమని సీపీఎం జిల్లా నాయకులు దుర్గారావు అన్నారు. సామాన్యులపై పన్నుల భారం మోపితే ప్రజా ఉద్యమాలు తప్పవని ఈ మేరకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యుడు శ్రీను, డివిజన్ నాయకులు రజినికుమార్, దుర్గావతి, కూరపాటి నాగరాజు పాల్గొన్నారు.

ఇదీచదవండి

రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.