తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని ఆస్తులను విక్రయించాలనుకోవడం.. వ్యాపారం చేయడంలాంటిదే అని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఒకసారి ఆస్తుల విక్రయాలు ప్రారంభిస్తే అక్కడితో ఆగదని... అమ్మకాలు జరుపుతూనే వెళ్తారని పేర్కొన్నారు. దేవస్థానం భూములను విక్రయించి సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదని... భక్తులు అందజేసిన విరాళాలతో కార్యక్రమాలు చేయాలని సూచించారు.
దేవస్థానానికి భక్తులు ఆస్తులు ఇచ్చింది విక్రయించడం కోసం కాదనే విషయాన్ని తితిదే గుర్తించాలన్నారు మధు. భక్తులు ముడుపులు, ఇతరులు విరాళాల రూపంలో వెంకటేశ్వరస్వామికి కానుకలు అందిస్తున్నారని... ఈ ఆదాయం నుంచి విద్య, వైద్యం వంటి పౌరసేవలను చాలా కాలం నుంచే దేవస్థానం నిర్వహిస్తోందన్నారు.
ఇవీ చదవండి... కరోనా ఎఫెక్ట్.. ఆన్లైన్లోనే పూజలు, హోమాలు