ETV Bharat / city

'నిర్మలాసీతారామన్​పై కేసు ఎందుకు పెట్టలేదు..?'

author img

By

Published : Jul 2, 2020, 12:00 PM IST

Updated : Jul 2, 2020, 12:31 PM IST

రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం వారి పెత్తనమే నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. కీలక పదవులన్నీ వారికే దక్కుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులపై ఎవరైనా నోరెత్తితే చాలు జైలులో పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై రాష్ట్రాన్ని తప్పుపట్టిన నిర్మలా సీతారామన్​పై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

cpi ramakrishna criticises ycp government
సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నోరెత్తితే చాలు.. జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్​పై కేసు ఎందుకు నమోదు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తోందని నిర్మలా ఆరోపణలు చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి ఓ మాట, రాష్ట్ర సలహాదారు ఓ మాట చెప్పారని.. ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పినట్లని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు అబద్ధమైతే ఆమెపై కేసు ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు.

పదవులు, పెత్తనాలు మీకేనా..?

రాష్ట్ర ప్రభుత్వంలో, అధికార పార్టీలో ఒక సామాజిక వర్గమే పెత్తనం చేస్తోందని రామకృష్ణ విమర్శించారు. మంత్రులను డమ్మీలను చేసి విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి మూడు ప్రాంతాల్లో పెత్తనం చేస్తున్నారన్నారు. 3 ప్రాంతాలను ముగ్గురు రెడ్లకు ఇచ్చి... సామాజిక న్యాయం గురించి, అంబేద్కర్ పూలే గురించి సీఎం జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తాము ఏదైనా అంశంపై విమర్శిస్తే కమ్మనిస్టులు అని కులం పేరుతో తిట్టడాన్ని తప్పుబట్టారు. తమకు కులం అంటగట్టే ముందు వారి పార్టీలో పదవులు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు.

వైకాపాలో వేరే కులాల వారు లేరా.. ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబటి రాంబాబు, పార్థసారథి, వరప్రసాదరావు వంటి వారు పదవులకు పనికిరారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ముఖ్యమంత్రి బంధువులు, వారి సామాజిక వర్గం వారే ఉన్నారని ఆరోపించారు. 70 మందిలో 46 మంది వారి కులం వారే ఉన్నారని... సెర్చ్ కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లు ఉన్నారని వివరించారు.

'ఆంధ్రప్రదేశ్​లో పెత్తందారీతనం నడుస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని ముగ్గురు, నలుగురే వ్యక్తులే నడిపిస్తున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే పరిస్థితి ఉందా? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెప్పారని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం అంటున్నారు. అలాంటప్పుడు ఆమెపై కేసు ఎందుకు పెట్టడంలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటే.. కేంద్ర మంత్రి మాటలకు మీ పరువు పోదా' -- రామకృష్ణ, సీపీఐ నేత

సెంటు, సెంటున్నరలో ఇళ్లు నిర్మించుకోవాలా?

గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సెంటు, సెంటున్నర భూమిలో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నించారు. రాజధాని భూముల్లో 1250 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడమంటే ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నట్లే అని వ్యాఖ్యానించారు. దూర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు కాదా? అని ముప్పాళ్ల నిలదీశారు.

ఇవీ చదవండి..

విషాదం.. నీటికుంటలో పడి అక్కాతమ్ముడు మృతి

Last Updated : Jul 2, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.