రాష్ట్ర ప్రభుత్వం నీటి పంపకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై విపక్షాలు, మేధావుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. అధికారంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్... ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదని... రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఇసుక బంగారం కంటే ఎక్కువయ్యిందని ,ఇసుక కొరత వలన వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు.అన్న క్యాంటీన్లు మూసివేయడం, పోలవరం పనులు ఆపడం సరికాదని... ఇలానే చేస్తే జగన్ ప్రభుత్వానికి బంద్‌ల ప్రభుత్వం అని పేరు వస్తుందన్నారు.
ఇదీ చదవండి