ETV Bharat / city

విజయవాడ ఆసుపత్రిలో అత్యంత దారుణ పరిస్థితి - విజయవాడ ఆసుపత్రిలో అత్యంత దారుణ పరిస్థితి

విజయవాడలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆసుపత్రిలో ఎవరు చేరుతున్నారో.. ఎవరు వెళుతున్నారో.. కూడా తెలియని అధ్వాన పరిస్థితి ఉంది. లోపలికి వెళ్లేవారు.. తిరిగి ఎలా వస్తారో కూడా తెలియని ఆందోళన అందరిలో ఉంది. కనీసం సమాధానం చెప్పే వాళ్లు కూడా కనిపించడం లేదంటూ బంధువులు గగ్గోలు పెడుతున్నారు. ఓ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినా.. అది నామమాత్రమే.

vijayawada
vijayawada
author img

By

Published : Aug 2, 2020, 6:40 AM IST

గుడివాడకు చెందిన ఎన్‌.ఎస్‌.వి.గోపాల్‌(56) విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో గత నెల 27న కరోనా లక్షణాలతో చేరారు. అదే రోజు అతనికి కరోనా నిర్థరణ పరీక్ష చేశారు. ఇంకా ఫలితాలు రాలేదు. ఈనెల 30వ తేదీ నుంచి కనిపించకుండాపోయాడు. గోపాల్‌ ఏమయ్యాడంటూ అతని బంధువులు ఆసుపత్రి సిబ్బందిని అడుగుతుంటే.. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బాగానే ఉన్నాడంటూ చెబుతూ వచ్చారు. ఈనెల 30న సాయంత్రం వరకు తమతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా అప్పటినుంచి ఏమయ్యాడో తెలియని పరిస్థితి ఉందంటూ.. బంధువులు వాపోయారు. కానీ.. ఆసుపత్రిలో ఎవరూ అతని జాడ చెప్పలేదు. బాగానే ఉన్నాడనే ఒక్క మాటే చెబుతూ వచ్చారు. తీరా చూస్తే.. అతను చనిపోయి ఆసుపత్రి మార్చురీలో శవంగా పడి ఉన్నాడు.

నెల కిందట విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ వృద్ధుడిని అతని భార్య స్వయంగా తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చింది. తీరా మరుసటి రోజు వచ్చి అడిగితే ఇక్కడెవరూ లేరు, ఎటో వెళ్లిపోయి ఉంటాడంటూ సమాధానం ఇచ్చారు. తీరా చూస్తే అతను చనిపోయి ఆసుపత్రి మార్చురీలో శవంగా పడి ఉన్నాడని తెలిసింది. అదికూడా మృతుడి భార్య తన భర్త ఏమయ్యాడో చెప్పాలంటూ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. పది రోజుల తర్వాత పోలీసులు వచ్చి గాలించి, సీసీ కెమెరాలన్నీ పరిశీలించాక విషయం తెలిసింది.

విజయవాడలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఆసుపత్రిలో ఎవరు చేరుతున్నారో.. ఎవరు వెళుతున్నారో.. కూడా తెలియని అధ్వాన పరిస్థితి ఉంది. లోపలికి వెళ్లేవారు.. తిరిగి ఎలా వస్తారో కూడా తెలియని ఆందోళన అందరిలో ఉంది. కనీసం సమాధానం చెప్పే వాళ్లు కూడా కనిపించడం లేదంటూ బంధువులు గగ్గోలు పెడుతున్నారు. ఓ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినా.. అది నామమాత్రమే. కేవలం రెండు గంటలు ఉంటుంది. అక్కడి సిబ్బంది అందరికీ ఒకటే సమాధానం చెబుతుంటారు. మీ వాళ్లు బాగానే ఉన్నారంటూ చెబుతున్నారని తరచూ బాధితుల బంధువులు వాగ్వాదాలకు దిగుతున్నారు. కనీసం వచ్చే బాధితుడి పేరు కూడా సక్రమంగా నమోదు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన రెండు సంఘటనలకు అవే ప్రధాన కారణం. వాళ్ల పేర్లు తప్పుగా నమోదు చేయడంతో చనిపోయినా.. ఏమయ్యారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గతంలో వృద్ధుడి విషయంలో అదే జరిగింది. తాజాగా చనిపోయిన గుడివాడకు చెందిన వ్యక్తి విషయంలోనే మరో పేరుతో నమోదు చేసి మార్చురీలో మృతదేహం పడేశారు. చివరికి ఉన్నతాధికారుల జోక్యం చేసుకున్నాకే.. అసలు విషయం బయటపడింది.

జవాబుదారీతనం లేదు..:

ఆసుపత్రిలో ప్రస్తుతం జవాబుదారీతనం ఎవరిలోనూ కనిపించడం లేదు. ప్రధానంగా పైస్థాయి వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదని, అసలు చాలామంది రోగుల వార్డుల్లోనికే వెళ్లడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం కిందిస్థాయిలో ఉండే సిబ్బంది, జూనియర్‌ వైద్యులతోనే మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బాధితుల గోడు పట్టించుకునేవాళ్లు, సరైన సమాధానం చెప్పేవాళ్లు లేకుండాపోయారు. కనీసం చేరిన రోగి ఎక్కడున్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది పరిశీలించే పరిస్థితి ఆసుపత్రిలో పూర్తిగా లోపించింది. సహాయ కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడుండే సిబ్బందికి వార్డుల్లోని రోగుల పరిస్థితికి సంబంధించిన సమాచారం అందించేవాళ్లు లేరు. స్వయంగా సహాయ కేంద్రంలో ఉండే సిబ్బందే ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు వచ్చి అడిగితే.. ఏదో ఒక సమాధానం చెప్పి పంపిస్తున్నారు. ఇదే వాగ్వాదాలకు తావుతీస్తోంది. ఇటీవల విజయవాడ గుణదలకు చెందిన ఓ మహిళ ఆసుపత్రిలో ఉన్న తన అన్న పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. బాగానే ఉన్నాడంటూ సహాయ కేంద్రం సిబ్బంది చెప్పారు. తీరా ఆమె ఆరా తీస్తే.. పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో సదరు మహిళ సిబ్బందితో గొడవకు దిగింది.

కేసులు పెరుగుతున్నా సౌకర్యాలేవి?. :

విజయవాడ రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో గతంలో ఏర్పాటు చేసిన మంచాలు, సౌకర్యాలే తప్ప.. కొత్తగా పెంచినవి లేవు. వైద్య సిబ్బంది పరిస్థితి అంతే. గతంలో తక్కువ మంది బాధితులు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో.. ఇప్పుడూ అంతే ఉన్నారు. కానీ.. బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతోంది. వారికి అవసరమైన పడకలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఆసుపత్రిలో ఉండడం లేదు. అందుకే.. వచ్చే వారందరికీ బెడ్స్‌ను ఏర్పాటు చేయడం సిబ్బందికి చాలా కష్టంగా మారుతోంది. వాహనాల్లో ఉన్న వారిని.. అలాగే వెళ్లిపోవాలంటూ తిరిగి పంపించే పరిస్థితి ఉంటోంది. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నిత్యం వస్తున్న వారితో నిండిపోతోంది. వారికి వెంటనే మంచాలు కేటాయించే పరిస్థితి ఉండడం లేదు. అందుకే.. విజయవాడ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

కరోనా @ 7200

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏడు వేలు దాటాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల మధ్యలో కొత్తగా 357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 7200కు పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 164మంది మృతి చెందారు. 4728మంది వైరస్‌ను జయించి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరారు. ప్రస్తుతం 2308మంది చికిత్స పొందుతున్నారు.

బందరు డివిజన్‌లో 3 నుంచి లాక్‌డౌన్‌

బందరు డివిజన్‌లో శనివారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆర్డీవో ఖాజావలీ ఓ ప్రకటనలో తెలిపారు. బందరు నగరంలో ఏడు నమోదు కాగా మిగిలిన 20 కేసులు డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయన్నారు. నగరంలోని జవ్వారుపేట, సర్కిల్‌పేట, రాజుపేట, గాంధీనగర్, సర్కారుతోట, జలాల్‌పేట, బుట్టాయిపేటలో ఒక్కోటి చొప్పున ఏడు కేసులు వచ్చాయన్నారు. వీటితో పాటు బందరు మండలంలోని కానూరు, పల్లెతాళ్లపాలెం, బుద్ధాలపాలెం, పోతిరెడ్డిపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని చెప్పారు. గూడూరు మండలం మల్లవోలు 2, పోలవరం 1, రాయవరం 1, అవనిగడ్డ 1, మొవ్వ మండలం కూచిపూడి 1, బంటుమిల్లి 1, మల్లపరాజుగూడెం 1, కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో 7 కేసులు చొప్పున నమోదయ్యాయని వివరించారు. కొత్తగా నమోదైన కేసులతో బందరు డివిజన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 759కు చేరుకుందన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బందరుతో పాటు డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు అత్యవసర పనులకు మినహా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.

ఇదీ చదవండి: అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.