ETV Bharat / city

కరోనాతో.. లెక్కల మాస్టారు జీవన ప్రయాణం లెక్క తప్పింది..! - కరోనా ప్రైవేటు టీచర్లకు సమస్యలు న్యూస్

ఆయనో మాస్టారు. ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్. చాక్​పీసుతో నల్లబోర్డుపై లెక్కలు రాసి పిల్లలకు సులువుగా నేర్పడంలో నేర్పరి. ఆర్నేళ్ల క్రితం వరకూ... అన్ని సరిగానే ఉన్నాయి. కానీ కరోనా మహమ్మారితో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు.

corona-effect-on-private-teachers-in-krishna-district
కరోనాతో.. లెక్కల మాస్టారు జీవన ప్రయాణం లెక్క తప్పింది..!
author img

By

Published : Aug 31, 2020, 1:52 AM IST

కరోనాతో.. లెక్కల మాస్టారు జీవన ప్రయాణం లెక్క తప్పింది..!

ఎంతో మంది పిల్లలను విద్యాధికులుగా చేసి సన్మానాలు పొందారు. వచ్చే వేతనంతో ఆర్నెళ్ల క్రితం వరకు హాయిగా బతికారు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఆ మాస్టారు జీవితాన్ని రోడ్డుపాలు చేసింది. పాఠశాలలు పూర్తిగా మూతబడటం.. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టడంతో పూట గడవని పరిస్థితుల్లో బజారులో చెప్పులు అమ్ముకుని జీవిస్తున్నారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ చెప్పులమ్ముకుని వచ్చిన నగదుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అక్కడే మరో ఉపాధ్యాయుడూ ఇదే తరహాలో గొడుగులమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

తిర్లుక వెంకటేశ్వరరావు.. విజయవాడ మాచవరంలోని డీబీఆర్కే వీధిలో నివాసం ఉంటున్నారు. 15 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పార్ట్ టైం టీచర్​గా పనిచేస్తున్నారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతి లో లెక్కలు చెప్పడం ఈ మాస్టారు ప్రత్యేకత. ఎంతో మంది పిల్లలు మంచి మార్కులు సాధించడంలో కృషి చేశారు. పిల్లలు, తల్లిదండ్రులతో అనేక సన్మానాలు అందుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలను, కుమారుడికి మంచి చదువు చెప్పిస్తున్నారు. సాఫీగా సాగుతోన్న ఈ మాస్టారు జీవన ప్రయాణం.. కరోనా రాకతో ఒక్క సారిగా లెక్క తప్పింది. లాక్ డౌన్ అమలుతో మార్చి నెలలో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరచుకోలేదు. దీంతో పాఠశాలల యాజమాన్యాలు వేతనం ఇవ్వడం ఆపేశాయి. నెలలు గడిచే కొద్ది ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమైంది.

పని కోసం పలు చోట్ల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆత్మాభిమానం చంపుకొని చెప్పులు అమ్ముతున్నారు. తనకు తెలిసిన స్నేహితుడి వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించి చెప్పులమ్మి పెడతానని కూలీగా కుదిరారు. రోజూ బీఆర్ టీఎస్ రోడ్డులోని సమీప దుకాణం నుంచి చెప్పులను మోసుకువచ్చి వాటిని రోడ్డుపై పెట్టుకుంటారు. చెప్పులపై పడిన దుమ్ము దూళిని తుడిచి వాటిని అమ్మకానికి సిద్ధం చేస్తారు. దారిలో వచ్చి పోయే వారికి చెప్పులను అమ్ముతారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటికి కాపలా కాస్తారు. ఇంతా చేసినా వచ్చేది రోజుకు 300 రూపాయలు మాత్రమే. వీటితోనే ఐదుగురు కుటుంబసభ్యులు జీవనం సాగించాలంటున్నారు మాస్టారు. ఇలా మూడు నెలలుగా చెప్పులు అమ్ముతూ కుటుంబాన్ని పూటగడుపుతున్నట్లు మాస్టారు తెలిపారు.

ఇది ఒక్క ఈ మాస్టారు కష్టం మాత్రమే కాదు... ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే చాలా మంది ఉపాధ్యాయులది. కరోనా ఎప్పుడు వెళ్తుందో.. పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయే అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అక్కడే గొడుగులు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మరో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కుటుంబాన్ని పోషించుకుంటుండటం వీరి కష్టాలకు అద్దం పడుతోంది.

అన్నివర్గాల వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నా.. ప్రైవేటు టీచర్లను మాత్రం పట్టించుకోకపోవడంతో తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టం ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నారు. దాతలు, లేదా ప్రభుత్వాలు సాయం అందించి తమ కష్టాలు తీర్చలేకపోతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిడే చెస్​ ఒలింపియాడ్​లో భారత్​కు స్వర్ణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.