రాష్ట్రంలో కొత్తగా 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 24 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 7,79,146 కి చేరగా..ఇప్పటివరకు కరోనాతో 6,406 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 7,35,638 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,881 కరోనా పరీక్షలు నిర్వహించగా....మెుత్తంగా 69.91 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కేసులు..
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 567 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 531, చిత్తూరు 473, ప్రకాశం 348, కృష్ణా 308, గుంటూరు 259, కడప 246, నెల్లూరు 240, విశాఖ 204, అనంతపురం 193, శ్రీకాకుళం 125, కర్నూలు 91, విజయనగరం జిల్లాలో 91 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు..
గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో కరోనాతో ఐదుగురు మరణించారు. గుంటూరు 4, కృష్ణా 4, విశాఖ 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీచదవండి