దేశ వ్యాప్తంగా రైతులు కష్టాల్లో ఉన్నారన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెండో రోజు మహానాడు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలంగాణలో రైతుల కష్టాలపై కొత్తకోట దయాకర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. భూపాల్ రెడ్డి బలపరిచారు. అకాల వర్షాలకు 37 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్న చంద్రబాబు.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరం చేయాలని సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కారని.. అయితే అవి అమలు చేయడం లేదన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఇంతవరకు ఆదుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి గింజ కొంటామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: