ETV Bharat / city

CM REVIEW: మోసాలు, అవినీతికి తావు లేకుండా ధాన్యం సేకరించాలి: సీఎం జగన్ - ధాన్యం సేకరణపై మంత్రులతో సీఎం సమీక్ష

ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే , ఫాంగేట్ల వద్దే ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ధాన్యం సేకరణలో పటిష్ట విధానం తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడించారు.మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని నిర్దేశించారు.

సీఎం జగన్ సమీక్ష
సీఎం జగన్ సమీక్ష
author img

By

Published : Nov 1, 2021, 7:43 PM IST

Updated : Nov 1, 2021, 8:23 PM IST

ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, కొడాలి నాని ,శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్​లో వరి సాగు , సహా దిగుబడులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో 15.66 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారని అధికారులు సీఎంకు తెలిపారు. దాదాపు 87లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి ఉంటుందని, దీంట్లో దాదాపు 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే విధానంపై సమగ్రంగా చర్చించిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం సేకరణలో రైతులకు మేలు చేసేలా కొత్త విధానంలోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ధాన్యం సేకరణలో ఇకపై మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై రైతుల ముంగిటే, ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెల్లింపుల్లో తప్పిదాలు లేకుండా, మోసాలు లేకుండా ఉండాలన్నారు. వేగంగా చెల్లింపులు చేసేందుకు వీలుగా ఇ–క్రాప్‌ బుకింగ్, ఈ కేవైసీ చేయాలని ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు చేయాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదన్న సీఎం.. అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదని అధికారులను నిర్దేశించారు.

ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. దీన్నొక సవాల్‌గా తీసుకుని, అన్నిరకాలుగా సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ ఇవ్వాలన్నారు. అలాగే ధాన్యం సేకరణపై వివరాలతో కూడిన బోర్డును ఆర్బీకేల్లో ఉంచాలన్న సీఎం... మంచి ధర పొందడానికి తగిన సలహాలు, సూచనలు కూడా అందించేలా ఈ కరపత్రాలను రూపొందించాలన్నారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర అందాలన్న సీఎం... దీనికోసం రైతులకు పరిజ్ఞానాన్ని పెంచేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి:

2021: రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

Last Updated : Nov 1, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.