ETV Bharat / city

TS CM KCR: 'మాది రాజకీయ పార్టీ..మఠం కాదు..ముందుండేది కూడా మేమే' - Cm kcr on trs party

తెలంగాణలో భవిష్యత్​లోనూ అధికారంలో ఉండేది తెరాస ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr On Trs Party) స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రసగించిన ఆయన.. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. వేరే పార్టీలు పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు.

'మాది రాజకీయ పార్టీ.. మఠం కాదు... ముందుండేది కూడా మేమే'

author img

By

Published : Oct 5, 2021, 5:48 PM IST

తెలంగాణలో భవిష్యత్​లోనూ తెరాస(Trs)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr On Trs Party) అసెంబ్లీ వేదిక(Telangana Assembly)గా చెప్పారు. కొంతమంది కలలు కంటున్నారని వారి కలలు ఎప్పటికీ నెరవేరవని తేల్చిచెప్పారు. తమది రాజకీయ పార్టీయేనని...మఠం కాదని స్పష్టం చేశారు. తమకు అన్ని రకాల అంచనాలు, సర్వేలు ఉన్నాయని దాని విధంగా నడుచుకుంటామని చెప్పిన కేసీఆర్.. తర్వాత ఏర్పడేది కూడా తెరాస ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.

'మాది రాజకీయ పార్టీ.. మఠం కాదు... ముందుండేది కూడా మేమే'

రఘునందన్ రావుకి చాలా పెద్ద సందేహం వచ్చింది. ఒక్క హుజూరాబాద్​కే విడుదల చేసిండ్రా.. వీటికి కూడా విడుదల చేసిండ్రా అని చెప్పి... ఇది ప్రభుత్వం రఘునందన్ రావు. మాకు చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం. ముందర కూడా మేమే ఉంటాం. మీరు ఉండేదేందో సచ్చేదేందో. మాకు అన్ని అంచనాలు ఉన్నయి. కొంతమందికి ఏదో ఈస్ట్​మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ మాది రాజకీయ పార్టీయే కదా మాదేమన్న మఠమా? మాకు తెల్వదా మాకు అంచనాలు, సర్వేలు ఉండవా? భవిష్యత్​లో కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది అందులో అనుమానం ఎందుకు? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎందుకు పక్కన పెడతరు? ఏం కారణం చేత పక్కన పెడతరు. నేను అందుకే చెప్పిన మాకు ఆత్మ విశ్వాసం ఉందని. ఈ నాలుగు మండలాలకు రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతాయి. మొదట్లో పెట్టుకున్న రూ. 1,000 కోట్లు కూడా ఖర్చు అవుతాయి. అంటే సుమారు 3వేల కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం మార్చిలోపల అమలవుతుంది.

-- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

త్వరలో ఉద్యోగ నియామకాలు

త్వరలో ఉద్యోగ నియమకాలు

సీఎం కేసీఆర్ తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్​ వివరించారు.

ఎక్కడి వాళ్లకు అక్కడే

"నూతన జోనల్​ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత.. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లా కేడర్​ పోస్టులు ఇచ్చేస్తాం. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది.. లెక్క ఉంటుంది. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుంది. జోనల్​ విధానం అనేది ఈ మధ్యే వచ్చింది. అది ఒక్కసారి ల్యాండ్​ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుంది. ఆ ప్రక్రియ కూడా 2, 3 నెలల్లో రిక్రూట్​మెంట్​ చేసేస్తాం. కొంత మంది రేపే చేయాలి. ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారు. అలా చేసేది కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది కదా. నిన్న గాక మొన్న కదా మన జోనల్​ విధానం వచ్చింది. మనం తీసుకొచ్చుకున్న జోనల్​ విధానాన్ని మనమే ధిక్కరించలేం కదా. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో నేను మాట్లాడతా. ఇప్పటికే సీఎస్​ మాట్లాడారు. ఒక్కసారి సెట్​ అయిపోతే.. ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్​మెంట్​ జరుగుతుంది. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. నాకున్న అంచనా ప్రకారం.. ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేలు కాక.. ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా సౌకర్యవంతంగా.. ఎక్కడి వాళ్లకు అక్కడే."

- సీఎం కేసీఆర్​, తెలంగాణ ముఖ్యమంత్రి

వ్యవసాయంలో మనమే నెం.1

వ్యవసాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. తెలంగాణ 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందని.. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందన్నారు.

'రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ప్రకృతి కూడా సహకరిస్తోంది. విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మి తెలంగాణలో 4 ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. 6 ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి వచ్చింది. ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా వచ్చింది. రాష్ట్రంలో కోటి 29 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. యాసంగిలో 65 లక్షల ఎకరాలు సాగులో ఉంది. నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం... నీటి తీరువా పన్నే లేదు.'

- సీఎం కేసీఆర్​

మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబందు..

దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు. గతంలో సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం చేశామని.. దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని కేసీఆర్ స్పష్టం చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ తెరాస ప్రభుత్వమే ఉంటుంది, దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళితబంధు పథకానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న కేసీఆర్.. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేదేనని సీఎం కేసీఆర్​ తెలిపారు.

'రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నా. దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగింది. పరిస్థితుల మేరకు బడ్జెట్‌ అంచనాలు సవరించి నిధులు కేటాయించడం ఆనవాయితీ. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉంది. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నాం. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉంది. అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాం.'

- సీఎం కేసీఆర్​

దళితుల పరిస్థితి దయనీయం

75 ఏళ్ల స్వాతంత్య్రానికి తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని వాపోయారు. స్వాతంత్య్రానికి ముందు కూడా వారు హింసకు గురయ్యారన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని కేసీఆర్​ కొనియాడారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్‌కు ఉండాలని అంబేడ్కర్ చెప్పారన్నారు.. కేసీఆర్​. అంబేడ్కర్ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. అంబేడ్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూరలేదన్న కేసీఆర్.. గత ప్రభుత్వాలు కొంత చేశాయన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పరిపాలించలేదన్న ఆయన..రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు.

ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి

తెలంగాణలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉందని అసెంబ్లీలో దళిత బంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్​ వెల్లడించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64 శాతం ఎస్సీ జనాభా ఉందన్నారు. అనేక జిల్లాల్లో దళితుల జనాభా 20 శాతం దాటిందని పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 17.53 శాతం మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్​ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపినా..కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీ గణన జరగాలి..

బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కులగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని శాసనసభ వేదికగా సీఎం పేర్కొన్నారు.

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం..

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గిరిజనులకు భూములు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గిరిజనులను అడ్డంపెట్టుకుని అటవీభూములు కొట్టేసేవారు ఉన్నారని కేసీఆర్​ తెలిపారు.

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలే..

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పనేలేదని (kcr clarify on 3 acres to dalits) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానంటూ వివరణ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు మూడెకరాల భూమి కూడా ఇస్తారా.. అంటూ మజ్లిస్‌ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని.. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నామని చెప్పారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్​ స్పష్టం చేశారు.

ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం..!

'దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం.'

- సీఎం కేసీఆర్​

ఇదీ చదవండి

SWECHA PROGRAMME: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.