వ్యక్తిగత పర్యటనపై నిన్న కడప జిల్లాకు వెళ్లిన సీఎం జగన్మోహన్రెడ్డి తిరుగు పయనమయ్యారు. ఇవాళ పులివెందులలో వైద్యుడు, తన మామ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో కడప చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 4.45 గంటలకు ఇడుపులపాయకు వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాష్ రెడ్డి, చంద్రగిరి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బిజేంద్రనాథ్ రెడ్డి పలువురు నేతలు స్వాగతం పలికారు. వీరితో దాదాపు నలభై నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం స్థానికుల నుంచి వినతులు స్వీకరించి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇడుపులపాయలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: CHIEF ELECTORAL OFFICER VIJAYANAND: 'ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదు..'