ETV Bharat / city

CM REVIEW: సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి: సీఎం జగన్ - ap latest news

CM REVIEW: సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వేతో భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం పరిశీలించారు..

CM REVIEW
సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి
author img

By

Published : Jun 6, 2022, 3:35 PM IST

సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి

CM REVIEW: సమగ్ర సర్వేతో భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయని సీఎం జగన్‌ అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో భూవివాదాల పరిష్కారం ఒకటన్న సీఎం జగన్‌.. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. వందేళ్ల తర్వాత సమగ్ర సర్వే జరుగుతోందని.. దీని ద్వారా ప్రజలు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం సమీక్షించారు.

సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం.. సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవడం లాంటివి చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవడం లాంటి ప్రతి అంశంలోను వేగం ఉండాలన్నారు. సీఎం జగన్‌కు అధికారులు సమగ్ర సర్వే వివరాలను వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం పరిశీలించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.