ETV Bharat / city

'దిశ' చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలి: సీఎం

'దిశ' యాప్‌ డౌన్‌లోడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

cm-jagan-review-on-disha
cm-jagan-review-on-disha
author img

By

Published : May 14, 2020, 9:22 PM IST

స్మార్ట్ ఫోన్లేగాక అన్ని ఫోన్లలో 'దిశ' యాప్​ సదుపాయాలుండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 'దిశ'పై అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశంలో హోంమంత్రి సుచరిత, సీఎస్, డీజీపీతోపాటు 'దిశ' అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ కూడా హాజరయ్యారు. 'దిశ' చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని జగన్ చెప్పారు. ప్రత్యేక కోర్టులు వీలైనంత త్వరగా ఏర్పాలు చేయాలని.. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.

వేగంగా కేసుల విచారణ జరిగేలా చూడాలి. దిశ అమలుకు ప్రత్యేక వాహనాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక డీ-అడిక్షన్‌ సెంటర్‌ను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలి.

- సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.