ETV Bharat / city

cm jagan review: వచ్చే నెలలో విశాఖ, అనంతలో 'అమూల్'​: జగన్​ - ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టిసారించాలి

రాష్ట్రంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వర్సిటీ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని.. కావాల్సిన వెటర్నరీ డిస్పెన్షరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలలో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

cm jagan review on animal  husbandry
ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టిసారించాలి
author img

By

Published : Jul 14, 2021, 10:14 PM IST

పశు సంవర్ధక, పాడి, మత్స్యశాఖలపై మంత్రి సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్​ సమీక్షించారు. చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలని సీఎం సూచించారు. సరసమైన ధరలకే మత్స్య ఉత్పత్తులు ప్రజలకు చేరాలని.. ఈ లక్ష్యాలను చేరుకునేందుకే ఆక్వా హబ్‌లు తీసుకొచ్చామన్నారు. స్థానిక మార్కెట్‌ను విస్తరించడం వల్ల రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 4.36లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం ఉందని, దీన్ని ఏడాదికి 12 లక్షల మెట్రిక్‌ టన్నులు చేయాలన్నది లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారించాలని.. పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. సీడ్, ఫీడ్‌ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా ఉండాలన్నారు. ఆక్వా లాబ్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 35 ల్యాబ్స్‌లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా.. మరో 21 ల్యాబ్స్‌ నవంబర్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఆక్వాకల్చర్‌ ల్యాబ్‌లను రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)కు అనుసంధానం చేయాలన్నారు. ఆక్వా లాబ్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి..

రాష్ట్రంలో 7 ఫిషింగ్‌ హార్భర్లు, 5 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లలో పనుల ప్రగతిపై సమీక్షించారు. 5 ఫిషింగ్‌ హార్బర్లు, 1 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌లో పనుల ప్రారంభమయ్యాయని.. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలన్నాారు. కేజ్‌ ఫిష్‌ కల్చర్, మరీ కల్చర్‌లపై దృష్టి సారించాలన్న సీఎం.. పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్‌.. మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా విస్తరించాలన్నారు.

పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ

పశుసంవర్ధక శాఖపైనా సీఎం సమీక్షించారు. గ్రామం, మండలం, నియోజకవర్గస్ధాయిలో ఏయే వెటర్నరీ డిస్పెన్షరీలు ఉండాలన్న దానిపై హేతుబద్ధత ఉండాలని, దానిపై కార్యాచరణ రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. కావాల్సిన డిస్పెన్షరీలు ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై పటిష్ఠంగా మ్యాపింగ్‌ చేయాలని..రైతు భరోసా కేంద్రాల్లోని(RBK) కియోస్కుల్లో పశుదాణా తదితర ఉత్పత్తులన్నింటినీ అందుబాటులో ఉంచాలన్నారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు మంచి స్పందన వస్తుందని.. వాటి ద్వారా రైతులతో నేచురల్‌ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఏయే రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలని.. అలాగే తదితర పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ అమూల్‌ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలవెల్లువ ప్రారంభమైందని.. ఆగష్టు నెలలో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి..

SOMU VEERRAJU: 'పోలవరం నిర్వాసితుల ఇబ్బందులను పట్టించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.