రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రశాంత్ కుమార్ మిశ్రతో సీఎం వైఎస్ జగన్ సోమవారం భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, హైకోర్టు పరిపాలనా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30న దిల్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల హైకోర్టుల సీజేలు, సీఎంల సమావేశ ఎజెండాపై చర్చించారు. 2016 ఏప్రిల్ 4న జరిగిన సీఎంలు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుపై దిల్లీలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున అక్కడ సమర్పించనున్న నివేదిక గురించి ముఖ్యమంత్రి, సీజే మిశ్ర సమీక్షించారు.
ఇదీ చదవండి :సీపీఎస్‌పై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీ