కరోనా వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్...ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ప్రధాని మోదీ ఉచిత వ్యాక్సినేషన్ నిర్ణయంపై అభినందించిన సీఎం..ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సిన్లను సరిగా వినియోగించడం లేదని లేఖలో ప్రస్తావించారు. ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు కేటాయించారని పేర్కొన్న సీఎం...జులైలో 17.71 లక్షల డోసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల వద్ద భారీగా వ్యాక్సిన్ నిల్వలున్నాయని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఆయా ఆస్పత్రులు వాడని డోసులను ప్రభుత్వం సేకరించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
సేకరించిన డోసులను ప్రభుత్వ కేంద్రాల ద్వారా అందించాలని కోరారు. తద్వారా వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. కేబినెట్ సెక్రటరీ భేటీలోనూ పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయని సీఎం ప్రస్తావించారు. డోసుల సరఫరాపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్...ప్రధానిని కోరారు.
ఇదీ చదవండి : DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్