ETV Bharat / city

Aerial survey: బాధితులను త్వరితగతిన ఆదుకోండి: సీఎం జగన్ - ఏపీలో వర్షాలు తాజా వార్తలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (CM Jagan Aerial survey) నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా.. కడప, చిత్తూరు, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన సీఎం.. బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

author img

By

Published : Nov 20, 2021, 3:19 PM IST

Updated : Nov 21, 2021, 4:34 AM IST

రాష్ట్రంలో భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి సుచరితతో కలిసి ఏరియల్‌ సర్వే (CM Jagan Aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయ పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు, తాగునీరు, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నౌకాదళ సిబ్బందిని సీఎం జగన్ కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్‌ద్వారా బుగ్గవంక వాగు, చెయ్యేరు నది కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు, పాపాఘ్ని, పెన్నా నదుల ప్రభావిత ప్రాంతాలు, పింఛ ప్రాజెక్టును సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రేణిగుంట, తిరుపతి నగరం, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీనది ప్రాంతాల్లోనూ హెలికాప్టర్‌ నుంచి పరిశీలించారు.

....

తిరుపతికి వరద నీరు రాకుండా ఆపండి: సీఎం జగన్‌

రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. తిరుపతి నగరానికి వరద నీరు రాకుండా ఆపాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నగరంలో వరదల ప్రస్తావన తెచ్చారు. పైభాగంలోని చెరువులకు వెళ్లాల్సిన నీరు దారి మళ్లించడం.. కాలువలు పూడ్చివేయడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా తిరుపతి నగరంపైకి వరద వస్తోందని వివరించారు. ప్రజలు పడుతున్న అవస్థలను.. సహాయ చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టరు హరినారాయణన్‌తో సీఎం మాట్లాడారు. వెంటనే పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు మరికొన్ని రోజులు తిరుపతిలోనే ఉండాలని ప్రద్యుమ్నకు సూచించారు. తిరుపతి నగరంలో వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వీధుల్లో, మురుగు కాల్వల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. తిరుపతి డ్రైనేజీ వ్యవస్థపై మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని, వరద నీరు తగ్గిన వెంటనే పంట నష్టంపై అంచానాలు రూపొందించాలని వెల్లడించారు. వరద బాధితులు సహాయ శిబిరాలకు రాకున్నా ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వారు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు. ఏరియల్‌ సర్వే ముగిసిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నారు.

పాతకాల్వ గ్రామస్థుల ఆందోళన

తిరుపతి వరదలపై సీఎం ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. వరద నీటిని కట్టిడి చేయడంలో భాగంగా పేరూరు చెరువు నీటిని పాతకాల్వ మీదుగా స్వర్ణముఖి నదిలోకి మళ్లించాలని కలెక్టరు హరినారాయణన్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి నగర కమిషనరు గిరీష నిర్ణయించారు. ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చూడగా.. పాతకాల్వ గ్రామస్థులు అడ్డుకున్నారు. నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ 3 కి.మీ మేర ఆగిపోయింది. కాలువలు, చెరువుల ఆక్రమణలతో తిరుపతిలోకి వరద నీరు పోటెత్తిందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. తమ గ్రామం వైపుగా నీరు మళ్లించడానికి వీలు లేదంటూ అడ్డు చెప్పారు. ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపి నచ్చచెప్పడంతో విరమించారు.

ఇప్పటి వరకు 24 మంది మృతి

వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో 24 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వేర్వేరు చోట్ల మరో 17 మంది గల్లంతైనట్టు తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.

ఇదీ చదవండి

TTD: తిరుమల ఘాట్‌రోడ్‌లో పునరుద్ధరణ పనులు.. భక్తులకు అనుమతి

Last Updated : Nov 21, 2021, 4:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.