ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినూత్న ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలకు ఆయన విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని బెరం పార్కు దీనికి వేదిక కానుంది. మంగళవారం రాత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి ఆయా టేబుల్ వద్ద సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే స్థానిక ఎమ్మెల్యేతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల సమయాన్ని వెచ్చించనున్నారు. ఆయా జిల్లాల పరిస్థితులు, సమస్యలు, అంశాలు, ఫిర్యాదులు, బాగోగులను సీఎం జగన్ విననున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.... ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విందు ఇస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి
17న అధికారులు... నేతలకు సీఎం జగన్ విందు - రచ్చబండ వార్తలు
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అధికారులు, నేతలకు ముఖ్యమంత్రి జగన్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా పరిస్థితులు, సమస్యలు, అంశాలు, ఫిర్యాదులు, బాగోగులను విననున్నారని సమాచారం.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినూత్న ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలకు ఆయన విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని బెరం పార్కు దీనికి వేదిక కానుంది. మంగళవారం రాత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి ఆయా టేబుల్ వద్ద సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే స్థానిక ఎమ్మెల్యేతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల సమయాన్ని వెచ్చించనున్నారు. ఆయా జిల్లాల పరిస్థితులు, సమస్యలు, అంశాలు, ఫిర్యాదులు, బాగోగులను సీఎం జగన్ విననున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.... ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విందు ఇస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి
ap_vja_08_15_cm_dinner_for_collectors_and_sps_av_3052784_1512digital_1576350420_581
Conclusion: