Cheddi Gang At Tadepalli: సీఎం జగన్ నివాసంతోపాటు అత్యంత భద్రత ఉండే తాడేపల్లి ప్రాంతంలో.. చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే నవోదయ కాలనీలో ఈనెల 3న అర్ధరాత్రి వేళ దుండగులు చోరీకి యత్నించారు.
వీరు చోరీకి యత్నించిన ఇళ్లు ఎమ్మెల్యేలవని తెలుస్తోంది. వాచ్మెన్ కేకలతో.. ముఠా అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. రెండ్రోజులుగా.. నవోదయ కాలనీ, అత్యంత ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిసింది.
ఇదీ చదవండి
fire accident: నిద్రిస్తుండగా.. గుడిసెకు నిప్పంటుకొని దారుణం