ETV Bharat / city

CBN Warns Leaders: 'పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్​'

Chandrababu warning: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్​ ఇచ్చారు. ఇకపై క్షేత్రస్థాయిలో పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్​ పెట్టనున్నట్లు హెచ్చరించారు.

Chandrababu warning
చంద్రబాబు హెచ్చరికలు
author img

By

Published : Apr 21, 2022, 1:56 PM IST

Updated : Apr 22, 2022, 4:01 AM IST

Chandrababu warning: తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల పనితీరుపై అధినేత చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పని చేయకుండా మాయ చేసే నేతలకు.. ఇక చెక్ పెడతానని హెచ్చరించారు. కొంతమంది నేతలు క్షేత్రస్థాయిలో పని చేయకుండా... పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇకపై అలాంటి నేతలకు కాలం చెల్లిందన్నారు. ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు తప్పించుకుంటున్నారో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందన్నారు.

పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

సీనియార్టీని గౌరవిస్తామని... అయితే ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే లాభం లేదని చంద్రబాబు అన్నారు. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తామని స్పష్టం చేశారు.

"సీనియార్టీని గౌరవిస్తాం.. సిన్సియార్టీని గుర్తిస్తాం. సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే లాభం లేదు. ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం. 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో పనిచేసే యువ నేతలనూ గుర్తిస్తాం.. అవకాశాలిస్తాం. సమాజ హితం కోసం తెదేపా అవసరం ఉంది... అందుకే విరాళాలు సేకరిస్తున్నాం. పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చు."- తెదేపా అధినేత చంద్రబాబు

పార్టీ సభ్యత్వ నమోదు: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. ఉండవల్లి గ్రామ పార్టీ నేతల ద్వారా చంద్రబాబు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వాట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు. చంద్రబాబు పార్టీకి ఆన్​లైన్​లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. వేదికపైనే అచ్చెన్నాయుడు, నారా లోకేశ్​లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్​లైన్​లో సభ్యత్వ నమోదు చేపట్టారు. 100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.

"రాష్ట్రాన్ని పుననిర్మాణం చేయాలనుకునేవారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. తటస్థులు సభ్యత్వం తీసుకోకున్నా తెదేపా సంకల్పానికి అండగా నిలవాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా అండగా నిలవాలి. తటస్థులు, మేధావులు కూడా తెదేపా అండగా నిలవాల్సి ఉంది. తెలుగుదేశం తొలిసారిగా అండమాన్ శాఖను అధికారికంగా గుర్తించింది. అండమాన్‌లో పార్టీ నేతలు పసుపు జెండా ఎగిరేలా చేస్తున్నారు." -నారా చంద్రబాబు నాయుడు

సెకనుకు 8,765 మంది ప్రయత్నం
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించగానే విశేష స్పందన లభించిందని, ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదుకు సెకనుకు 8,765 మంది ప్రయత్నించారని చంద్రబాబు తెలిపారు. దానివల్ల సర్వర్‌ కొంత సేపు మొరాయించిందని, దాన్ని వెంటనే పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలు, నాయకుల వివరాలను వాటిలో నిక్షిప్తం చేసే బాధ్యతను నారా లోకేశ్‌, చింతకాయల విజయ్‌, కిలారు రాజేష్‌, మద్దిపాటి వెంకట్రాజులకు అప్పగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వారి పనితీరును ప్రతి 15 రోజులకు తాను సమీక్షిస్తానన్నారు. ‘నా ఆలోచనలు ఎప్పుడూ మిగతా వారికంటే 10-15 ఏళ్లు ముందుంటాయి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ తెదేపా ఎప్పుడూ ముందుంటుంది. మన జీవితాల్లో టెక్నాలజీ అనివార్యమైపోయింది. ప్రతి నాయకుడూ దాన్ని వినియోగించుకోవాలి’ అని తెలిపారు.

ఉదారంగా విరాళాలివ్వండి
పార్టీకి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ.9,99,999 విరాళమిచ్చిన లోహిత్‌ని ఆయన అభినందించారు. ‘పార్టీకి 60-70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మీ శక్తిని బట్టి విరాళాలు ఇవ్వండి. పార్టీ సభ్యత్వ నమోదుపై ట్రయల్‌ నిర్వహిస్తున్న సమయంలోనే 20వేల మంది సభ్యులుగా చేరారు. సభ్యత్వ రుసుముగా రూ.20 లక్షలు రావాలి. కానీ రూ.48 లక్షలు వచ్చింది. అంటే రూ.28 లక్షలు విరాళంగా వచ్చింది’ అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీలోని వివిధ విభాగాలకు సమాంతరంగా ఎన్నికల ప్రక్రియ కోసం క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒకర్ని బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అనుసరించిన ఈ నమూనాను రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి ఇంటికీ నాయకులు వెళ్లాలన్నారు. తానూ ఐదు ప్రాంతాలకు వెళతానన్నారు.

అండమాన్‌-నికోబార్‌ నుంచి తెదేపా నాయకులు మాట్లాడుతూ... ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు కౌన్సిలర్‌ స్థానాల్ని గెలుచుకున్నామని, భాజపాతో కలసి అధికారంలోకి వచ్చామని తెలిపారు. మేయర్‌ పదవిని తలో సగం కాలం పంచుకున్నామన్నారు. అండమాన్‌-నికోబార్‌ విభాగాన్ని అధికారికంగా గుర్తిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏపార్టీ చేయలేనంత సాంకేతికతతో సభ్యత్వ నమోదును చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా సభ్యత్వ యాప్​లో పార్టీ సభ్యత్వ నమోదును ఏ విధంగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయో లోకేశ్ వివరించారు. వాట్సప్ నెంబరును తెలిపారు.

ఇదీ చదవండి: తెదేపా సభ్యత్వ నమోదును ప్రారంభించిన చంద్రబాబు

Last Updated : Apr 22, 2022, 4:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.