పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ తేదీన కర్నూలు, 5వ తేదీన చిత్తూరు, 6వ తేదీ విశాఖ, 7న విజయవాడ, 8వ తేదీన గుంటూరులో చంద్రబాబు పర్యటన సాగనుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా ప్రాంతాల్లో రోడ్ షో లు నిర్వహించనున్నారు. పది అంశాలపై ఇప్పటికే తెదేపా రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించటంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలే అజెండాగా తమ అధినేత పర్యటనలు సాగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: సస్పెన్షన్ కేసులో కౌంటర్ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం