ETV Bharat / city

'సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా..ఏమిటీ ఆటవిక సంస్కృతి ?' - సర్పంచ్ కిడ్నాప్​పై చంద్రబాబు కామెంట్స్

ప్రకాశం జిల్లా పెద్డగంజాంలో సర్పంచి అభ్యర్థి తిరుపతిరావును కిడ్నాప్ చేయటంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కిడ్నాప్​న​కు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా..ఏమిటీ ఆటవిక సంస్కృతి ?

author img

By

Published : Jan 30, 2021, 8:56 PM IST

ప్రకాశం జిల్లా పెద్డగంజాంలో సర్పంచి అభ్యర్థి తిరుపతిరావును కిడ్నాప్ చేయటంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైకాపాలో నెలకొందని ట్వీటర్ వేదికగా విమర్శించారు.

ఏమిటీ ఆటవిక సంస్కృతి?. ఎన్నిక అనేది లేకుండా గెలవడానికి ఆంధ్రప్రదేశ్​లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందా?. ప్రత్యర్థులు పోటీకి నిలబడితే ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని వైకాపా నేతలు భయపడుతున్నారనడానికి ఇది నిదర్శనం. నామినేషన్ వేసే అభ్యర్థికి కనీస రక్షణ కూడా కల్పించలేకపోవటం దారుణం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. తిరుపతిరావును సురక్షితంగా తీసుకొచ్చి నామినేషన్ వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. -చంద్రబాబు

కిడ్నాప్​న​కు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న చోట్ల ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలన్నారు.

ఇదీచదవండి

సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.