రాష్ట్రంలో ఎన్నికల సంఘం దారుణంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తే రిజర్వేషన్లు, డీలిమిటేషన్లు రాత్రికి రాత్రే మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా సంబంధిత అధికారులను సెలవు పెట్టి వెళ్లిపొమ్మంటున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు డబ్బు, మద్యం ఇష్టానుసారంగా పంచుతున్నారని ఆరోపించిన చంద్రబాబు... వాళ్లు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
మంత్రి పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి
వివిధ ప్రాంతాల్లో వైకాపా నేతల వైఖరిపై చంద్రబాబు వీడియో ప్రదర్శించారు. 'ఇష్టానుసారం రిజర్వేషన్లు చేసి బీసీలకు తీరని అన్యాయం చేశారు. ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన రిజర్వేషన్లు మారుస్తారా?. రాష్ట్రంలో ఎక్కడా హోర్డింగ్‌లు తొలగించలేదు. తమిళనాడు నుంచి తీసుకువచ్చి మద్యం పంచుతున్నారు. మచిలీపట్నంలో దుర్మార్గంగా వ్యవహరించారు. పుంగనూరులో ఇతర వ్యక్తులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించి.. అరెస్టు చేయాలి. పుంగనూరు ఘటనకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. ఇక నుంచి బెదిరింపులు జరిగేందుకు వీల్లేదు. తప్పుడు పనులు చేసేందుకేనా యాప్ తయారుచేశారు.' అని చంద్రబాబు ప్రశ్నించారు.
చీరలు పంచారు
ఎన్నికలు జరిగినంత కాలం మద్య నిషేధం అమలుచేయాలని చంద్రబాబు సూచించారు. మద్యం ప్రస్తావన లేని ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. తాడిపత్రిలో వైకాపా నేతలు చీరలు పంచారని తెలిపారు.
ఇదీ చదవండి: