శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు, ప్రజలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖలో రాజధాని అని చెబుతున్న జగన్... అక్కడ అర్ధాంతరంగా నిలిచిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదని విమర్శించారు. మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారన్న చంద్రబాబు.. హిందూ దేవాలయాలపై దాడుల వెనక చీకటి అజెండా ఉందని ఆరోపించారు. మతమార్పిడుల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తున్నారని తెదేపా అధినేత మండిపడ్డారు. సింహాచలం ఆలయంతో ప్రారంభమైన ఆలయాలపై దాడిని నేడు తిరుమల వరకు తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థులు దేవాలయాల పట్ల అపచారాలు, హేళన చేయడం, భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: తిరిగిరాని లోకాలకు బాలు.. శోకసంద్రంలో ప్రజానీకం