ETV Bharat / city

CHANDRABABU: సంక్షేమం పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారు: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్​లో (vaccination) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు (chandra babu) ఆక్షేపించారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్ (jagan) మోసం చేశారన్నారు. ఇచ్చింది గోరంత, దోచింది కొండంత అని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రెచ్చిపోవటంతో పాటు ఇళ్ల నిర్మాణం, భూ కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు.

chandrababu fire on ycp govt over Public welfare
సంక్షేమ పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారు
author img

By

Published : Jun 22, 2021, 5:15 PM IST

Updated : Jun 22, 2021, 8:43 PM IST

సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్ (cm jagan) మోసం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు (chandra babu) విమర్శించారు. ఇచ్చింది గోరంత, దోచింది కొండంత అని ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. సీఎం జగన్ అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్​లో (vaccination) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆక్షేపించారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు వేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మట్టి, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రెచ్చిపోవటంతో పాటు ఇళ్ల నిర్మాణం, భూ కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు.

"అసమర్థత, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనందున నిరుద్యోగ యువత భవితవ్యం ప్రశ్నార్థకమైంది. జాబ్ క్యాలెండర్ (job calendar) పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండర్ విడుదల చేయటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రూప్-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయం. ఏటా రూ.లక్షలు ఖర్చు పెట్టి వివిధ రకాల శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి కల్పించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేకపోవటంతో యువజన, విద్యార్థి సంఘాలు జగన్ వైఫల్యాలను నిలదీస్తున్నాయి. పది, ఇంటర్ పరీక్షలను (inter exams) అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తే.., జగన్ మాత్రం ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో ప్రజలను మభ్యపెట్టేందుకే రోజుకో ప్రకటన చేస్తున్నారు." -చంద్రబాబు

సంక్షేమం మాటున అనేక అక్రమాలు

సంక్షేమం మాటున అనేక అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ బోగస్ అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కోత విధించి చేయూత పేరుతో మోసగించారని ఆరోపించారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పింఛన్ (pension) ఇస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన జగన్..అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని ధ్వజమెత్తారు. ఏటా రూ.36 వేలు చొప్పున 5 ఏళ్లలో ప్రతి మహిళకు రూ.1.80 లక్షలు చెల్లించాల్సి ఉండగా..రూ.1.05 లక్షలు ఎగ్గొట్టారని ఆక్షేపించారు. ఏటా రూ.18 వేలు మాత్రమే ఇస్తూ.. 4 ఏళ్లకే పథకాన్ని పరిమితం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాననే హామీని విస్మరించటంతో పాటు ఫించను రూ.3 వేలు చేస్తానని రూ.250 మాత్రమే పెంచి వితంతువులు, వృద్ధులను మోసగించారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉప ప్రణాళికలో రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించటంతో అత్యాచారాలు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలం

వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. కొవిడ్ (covid) నియంత్రణ, వ్యాక్సినేషన్​లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వారం రోజులు టీకా వేయకుండా ఒక్కరోజు మమ అనిపించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ధాన్యం బకాయిలు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెదేపా ప్రభుత్వంలో రెండు రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేసి మిల్లర్లు మోసగించకుండా చూశామని గుర్తు చేశారు. దళారులు, మిల్లర్లు కలిసి దోచుకుంటున్నందున రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు. పట్టిసీమను విమర్శించి గోదావరిలో లిఫ్ట్ (godawari lift) పెడుతున్నారన్నారు. ఆర్డీఎస్​ను (RDS) నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలవరం నిర్మాణంలో అనేక సమస్యలు సృష్టించారన్నారు.

కక్ష సాధింపు చర్యలకు గుణపాఠం తప్పదు

తెదేపాలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి భవిష్యత్తులో గుణపాఠం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. పల్లా శ్రీనివాస్, మాన్సాస్ ట్రస్ట్, (mansas trust) బీసీ జనార్థన్ రెడ్డి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగడుతూ..ఈ నెల 29న 175 నియెజకవర్గాల్లో తెదేపా ఆందోళనలు తలపెట్టిందని వెల్లడించారు.

ఇదీచదవండి

Chiranjeevi: సీఎం జగన్​ నాయకత్వం స్ఫూర్తిదాయ‌కం: చిరంజీవి

Last Updated : Jun 22, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.