నేరచరిత్రులు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఆంధ్రప్రదేశే ఓ ఉదాహరణ అని చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్‌నేతలు, అన్నినియోజకవర్గాల ఇన్ఛార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులకు ఎలాంటి వరద సాయమూ లేదు.
'భారీ వర్షాలతో 5జిల్లాలలు అతలాకుతలమయ్యాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారు. వరుస విపత్తుల్లో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం రెండేళ్లుగా ఆదుకోలేదు. కరోనా, వరద బాధితులకు ఎలాంటి సహాయక చర్యలు లేవు. గిట్టుబాటు ధరలేక, విపత్తు సాయం అందక రైతులు నష్టపోయారు. ఉచిత విద్యుత్ 40 ఏళ్లుగా రైతులు పోరాడి సాధించుకున్న హక్కు. దానిని కాలరాసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులంతా వ్యతిరేకిస్తున్నందున వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తెదేపాపై ఉంది. వైకాపా రైతు వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రైతు పోరాటం అభినందనీయం
అమరావతికోసం 300రోజులుగా ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీల పట్టుదల అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పోరాటం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు వైకాపా నమ్మక ద్రోహం చేయడం దుర్మార్గమన్న తెదేపా అధినేత.. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకే వస్తుందని తెలిపారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అవహేళన చేయడం, ఎస్సీలను బూతులు తిట్టడం, ఉద్యమం చేసే మహిళలను అవమానించడమేంటని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రం నేరగాళ్లమయం
గత వారం రోజుల్లో మూడుచోట్ల ఎస్సీ, బీసీ బాలికలపై అత్యాచారాలు జరగడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు పోటీపడి అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల కొల్లగొట్టారని పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేల అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేయాలని నేతలకు సూచించారు. ఇసుక, గనుల దోపిడి అడ్డుకోవాలని.. భూకబ్జాలను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: