విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ నష్ట తీవ్రతను సీఎం జగన్ దాచేందుకు యత్నించడం తగదని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. విషవాయువుల విడుదల వల్ల జరిగే అనర్థాలకు వాస్తవాలే సాక్ష్యాలంటూ... ట్విట్టర్‌లో చిత్రాలను పోస్ట్ చేశారు. స్థానికుల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావం సహించలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ ప్రజలు భయంతో రాత్రిపూట రోడ్లపై నిద్రిస్తున్నారని తెలిపారు. న్యాయం కోసం స్థానిక నివాసితులు వీధుల్లో నిరసన తెలుపుతున్నారని, ప్రాణాలు కోల్పోయిన తమవారి మృత దేహాలతో రోదిస్తున్నారని చెప్పారు. ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా చేయలేదని, ఏ ఒక్క ఆస్తిని కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
అదే కోటి రూపాయలు మీకిస్తాం.. చావడానికి సిద్దమా?: లోకేశ్
విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ తమకొద్దు అని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అదే కోటి రూపాయలు ముఖ్యమంత్రి జగన్, వైకాపా మంత్రులకు ఇస్తే చావడానికి సిద్దమా అని విశాఖ వాసులు, ఎల్జీ గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. తక్షణమే ఈ ఘటనకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు ప్రజల డిమాండ్లకు అంగీకరించి... కంపెనీని అక్కడి నుండి తరలించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: