ETV Bharat / city

దీపక్​రెడ్డిని క్వారంటైన్‌లో ఎందుకు ఉండమన్నారు?: చంద్రబాబు - క్వారంటైన్​లో ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి న్యూస్

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని క్వారంటైన్​లో ఉండమనడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

chandrababu about mlc deepak reddy quarantine

author img

By

Published : Jun 24, 2020, 10:22 PM IST

ప్రజల ఆరోగ్యంతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్ష కిట్లు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కరోనా పరీక్షల్లో డొల్లతనం బయటపడిందన్నారు.

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి చేసిన పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు రాలేదన్నారు. రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? అన్న చంద్రబాబు పాజిటివ్ లేకుండానే ఎమ్మెల్సీని క్వారంటైన్‌లో ఎందుకు ఉండమన్నారని నిలదీశారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని క్వారంటైన్​లో ఉండమనడం రాజకీయ దురుద్దేేశాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి కరోనా నెగెటివ్ ఉన్నా.. పాజిటివ్ అని ఎలా చెప్తారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.