ETV Bharat / city

'మహా' విజయవాడకు మోక్షమెప్పుడో..?

పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'మహా' విజయవాడ మ్యాటర్ మళ్లీ తెరపైకి వచ్చింది. నగరాలు, పట్టణాల్లో చుట్టపక్కల ప్రాంతాల్ని, గ్రామాల్ని విలీనం చేస్తున్న ప్రభుత్వం.. విజయవాడ విషయంలో మాత్రం భిన్నంగా ఉందనే విమర్శలున్నాయి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని విలీనం చేస్తూ.. విజయవాడలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాల్ని నగరపాలక సంస్థలో కలపకుండా విభజిస్తోంది. విజయవాడను 'మహా'నగరంగా మార్చాలన్న ఆకాంక్షలకు గండి కొడుతోంది. అన్ని అర్హతలు, అవకాశాలున్నా విజయవాడను గ్రేటర్‌గా మార్చడానికి ఎందుకు ముందడుగు వేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

author img

By

Published : Feb 27, 2021, 8:01 AM IST

Chances to Vijayawada as Greater City
Chances to Vijayawada as Greater City

విజయవాడను గ్రేటర్ నగరంగా మార్చాలన్న ప్రతిపాదన 15 ఏళ్లుగా నానుతోంది. అన్ని అర్హతలు, అవకాశాలున్నా విజయవాడకు గ్రేటర్ మోక్షం కలగడం లేదు. బెజవాడ ప్రజల ఆకాంక్ష తీరడంలేదు. అన్ని రంగాల్లో దేశంలోని ఇతర మహానగరాలతో విజయవాడ పోటీపడుతున్నా... గ్రేటర్ నగరంగా ఎందుకు మార్చడంలేదనే చర్చ జరుగుతోంది..!

విజయవాడ నగరంలో అంతర్భాగంగా, చుట్టుపక్కలున్న పంచాయతీలను కలిపి 'గ్రేటర్‌ విజయవాడ'గా మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. విజయవాడలో, చుట్టుపక్కలున్న 14 గ్రామాల్ని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) పరిధిలోకి తేవాలని 2005లోనే తీర్మానం చేశారు. తర్వాత ఆ సంఖ్య 30కి, 45కి, 51కి పెరిగింది కానీ... ఒక్క గ్రామాన్నీ విలీనం చేయలేదు.

ప్రభుత్వం ‘గ్రేటర్‌ ప్రతిపాదనను పూర్తిగా పక్కకు నెట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాల్ని నగరంలో కలపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ఏడాది కిందట ఇబ్రహీంపట్నాన్ని ప్రత్యేక మున్సిపాలిటీ చేసింది. విజయవాడలో భాగమైన యనమలకుదురు, తాడిగడప, పోరంకి, కానూరుల్ని కలిపి ప్రత్యేక మున్సిపాలిటీగా చేస్తూ ఆర్డినెన్స్‌ ఇచ్చింది. నగరాన్ని ఇలా ముక్కలు చేస్తూ.. ఎక్కడికక్కడ చిన్నచిన్న మున్సిపాలిటీలు చేసుకుంటూ పోతూ... ‘గ్రేటర్‌’ఆశల్ని సమాధి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అర్హతలు ఉన్నా...

రాష్ట్రానికి నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున విజయవాడ నగరం ఉంది. తాగునీటికి కొరత లేదు. పెద్ద రైల్వే జంక్షన్‌, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖ వంటి నగరాలకు మధ్యలో ఉంది. రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నగరంలోనూ, చుట్టుపక్కల విద్యా సంస్థలు, ఆస్పత్రులున్నాయి. ఇలా అన్ని అర్హతలూ ఉన్నా విజయవాడను ఎందుకు మహానగరం చేయడం లేదనే ప్రశ్న నగరవాసుల నుంచి ఉత్పన్నమవుతోంది.

కృష్ణా జిల్లాలోని విజయవాడ చుట్టుపక్కలున్న గ్రామాలతో పాటు, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్ని విజయవాడలో విలీనం చేస్తే.. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా, గ్రేటర్‌ సిటీగా ఎదిగేది. 15 ఏళ్ల కిందట జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి అర్హత సాధించేందుకు విజయవాడ జనాభా తక్కువగా ఉండటంతో... తాడేపల్లి, మంగళగిరిని కలిపి చూపించి పథకానికి అర్హత సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరలి వచ్చినవారితో విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో జనాభా సుమారు 20 శాతం పెరిగిందని అంచనా. విజయవాడ చుట్టుపక్కల 51 గ్రామాలతోపాటు, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్ని విలీనం చేస్తే జనాభా సుమారు 20-25 లక్షలకు, నగర పరిధి 547 చదరపు కిలోమీటర్లకు పెరిగేది.

'మహా' ప్రయోజనాలివీ..

గ్రేటర్​ అయితే... నగర పరిధిలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికీ, ప్రణాళికల రూపకల్పనకు వీలుంటుంది. ఉన్నత విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఇలా ఒక్కోటీ ఒక్కో ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి. దేశ, విదేశాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఐటీ, ఇతర సేవారంగాలకు చెందిన సంస్థలు, పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ పెరుగుతుంది. తాగునీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థల వంటివి శివారు ప్రాంతాలకు విస్తరించవచ్చు. నగర విస్తీర్ణం, జనాభా సంఖ్య ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద ప్రత్యేకంగా నిధులు మంజూరవుతాయి.

నష్టాలివీ..

విజయవాడ నగరంలో ఇప్పటికే అంతర్భాగంగా ఉన్న ప్రాంతాల్ని వేరుగా చూడటం వల్ల అభివృద్ధిలో అసమానతలు ఏర్పడతాయి. చిన్నచిన్న మున్సిపాలిటీలుగా ఉంటే పురపాలకశాఖ అధికారులను వాటికి కమిషనర్లుగా నియమిస్తారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో మాట్లాడగలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకే నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో... కొన్ని నగరపాలక సంస్థ పరిధిలో, మరికొన్ని మున్సిపాలిటీల్లో, ఇంకొన్ని పంచాయతీలుగానూ ఉంటే పాలనా వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. ఆశించినంత అభివృద్ధి జరగదు.

ఇదీ చదవండీ... జగన్ పరిపాలనలో.. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.