ఏపీలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కోల్ ఇండియా బొగ్గు సరఫరా చేస్తోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Central Minister Prahlad Joshi On Coal supply For AP Thermal Plants) స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 13.24 టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు వెల్లడించారు.
గతేడాది ఇదే కాలంలో కేవలం 7.18 టన్నుల బొగ్గును సరఫరా చేసినట్లు తెలిపారు. విద్యుత్ కేంద్రాలకు మరో 4.97 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జోషి..బొగ్గు సరఫరాపై రాష్ట్రానికి కోల్ ఇండియా ప్రతిపాదన పంపిందన్నారు.
విద్యుత్ వినియోగం పెరగడంతో దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ ఏర్పడిందనన్న జోషి.. ఈ ఏడాది ఇప్పటి వరకు 291.72 టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి