కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా.. ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం నిర్వహించారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర, అంతరాష్ట్ర పరిధిలో వాహనాలు రాకపోకలపై రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిచోట ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను ఈనెలాఖరు వరకూ పొడిగించిన నేపథ్యంలో హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి 7గం.ల నుంచి ఉదయం 7గం.ల వరకూ రాత్రి కర్ఫ్యూ ను కొనసాగించాలని చెప్పారు.